![]() |

భూమి - గగన్ ల న్యూ ఇయర్ పార్టీ పేరుతో జీ తెలుగులో ఆదివారం ఒక ఈవెంట్ రాబోతోంది. దీనికి అనిమల్ మూవీ హీరో రన్బీర్ కపూర్ లా హర్విన్ వచ్చాడు. ఇక రాములమ్మల ఈర్య వచ్చింది. స్టేజి మీదకు వచ్చిన హర్విన్ గట్టిగా గన్ పట్టుకుని రన్బీర్ కపూర్ అని అరిచాడు. వెంటనే హోస్ట్ రవి ఐతే "ఖీర్ లో వేసే కిస్మిస్ అంత అంత ఉన్నావ్ నువ్వు రన్బీర్ కపూర్ ఆ" అని అడిగాడు. వెంటనే హర్విన్ కూడా తగ్గకుండా "పెళ్ళాం కొడితే బాత్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చే వాడిలా ఉన్నావ్ నువ్వు యంకరా..బచ్చా చోటా బచ్చా " అని ఒక పెద్ద భారీ డైలాగ్ చెప్పి రవి పరువు తీసేసాడు. తర్వాత ఈర్య వచ్చి "ఐ యాం రాములమ్మ ఆ జై ని చూడు మా జానుని ఎంత క్షోభ పెడుతున్నాడో తెలుసా" అంది. "నీ ముఖం మీద వేసే మేకప్ అది గ్రాఫిక్" అన్నాడు ఈర్యతో. "హలో అక్కడికి మీ అబ్బాయిలందరూ అందగాళ్ళయినట్టు" అంటూ ఈర్య రివర్స్ డైలాగ్ వేసింది.

"మా మగాళ్ల మీద ఈగ వాలినా ఢిల్లీ తగలబెట్టేస్తా" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు హర్విన్. "అసలేముందిరా మీ మగాళ్లలో అంత గొప్ప" అంటూ ఈర్య ఫైర్ అయ్యింది. "అసలు మీ ఆడోళ్ళంటేనే అన్యాయం, సెల్ ఫిష్ లు" అన్నాడు హర్విన్. "ఇంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడినా ప్రాణం తీస్తా" అంది ఈర్య. ఇక నెటిజన్స్ ఐతే రకరకాల కామెంట్స్ తో పిల్లలని ఎంకరేజ్ చేస్తున్నారు. "అరే బుడ్డోడా నువ్వు మగాడ్రా బుజ్జి..నేను మగాణ్ణి, నేను మగాణ్ణి అని చెప్పావు నాకు అదే గుర్తొస్తుంది నిన్ను చూసినప్పుడల్లా...హర్విన్ అండ్ ఈర్య..లవ్ యు రా" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
![]() |